26 రోజుల్లో ‘మహానటి’ కలెక్షన్స్‌ ..

217

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ‘మహానటి’ మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షల్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ లో ఇది కూడా స్థానం దక్కించుకోవడం సావిత్రి గారి అభిమానులనే కాదు సినిమా ప్రేమికులను సైతం ఆనందానికి గురి చేసింది. ఇప్పటికే 26 రోజుల రన్ పూర్తి చేసుకున్న మహానటి ఇప్పటి దాకా 26 కోట్ల షేర్ రాబట్టుకోవడం విశేషం.

Mahanati

సావిత్రి జీవితంలోని జరిగిన విషాద సంఘటనలు, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపడం. సీనియర్ నటీనటులతో పాటు, క్రేజ్ వున్న ఈ తరం నటీనటులు నటించడం. నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించాయి.

కొత్త సినిమాలు వరస బెట్టి వస్తున్నా అన్ని కేంద్రాల్లో స్టడీగా ఉండటం వసూళ్ల పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. కథ విషయంలో చిన్న చిన్న కామెంట్స్ ఉన్నప్పటికీ నాగ అశ్విన్ సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరుకు ఏకగ్రీవంగా పట్టం దక్కింది. ఇంకో రెండు వారాలు రన్ బాగానే ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. బలంగా పోటీ ఇచ్చే సినిమా మహానటి తర్వాత ఏది రాకపోవడం కూడా ప్లస్ గా మారింది.