ఇంగ్లాండ్‌లో కొత్త వైరస్ కలకలం..

143
norovirus

ఇంగ్లాండ్‌ను కొత్త రకం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనాతో ఇంగ్లాండ్ అతలాకుతలం కాగా తాజాగా నోరో వైర‌స్ ఆ దేశ ప్రజలను నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులు 154 నమోదుకాగా ప్రాణాంత‌కం కాక‌పోయిన‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు.

ఈ వైర‌స్ సోకిన వారిలో వాంతులు, వికారం, జ్వ‌రం, విరోచ‌నాలు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. మూడు రోజుల‌పాటు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించనుండగా క‌లుషిత‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల‌న ఈ వైర‌స్ సోకుతున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. నిత్యం చేతులు శుభ్రంగా ఉంచుకోవ‌డం, మంచి ఆహ‌రం తీసుకోవ‌డం, పాత్ర‌ల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం వంటివి చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.