హ్యాపీ బర్త్ డే….సితార

76
sitara

ప్రిన్స్‌ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని పుట్టిన రోజు నేడు. 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సితారకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సితారాకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సితార చేసే అల్లరి, మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, పాడే పాటలు, ఆడే ఆటలు, చేసే డ్యాన్సులు తెగ వైరల్ అవుతుంటాయి.

కేవలం ఇన్ స్టాగ్రాంలోనే కాకుండా యూట్యూబ్‌లోనూ సితార దుమ్ములేపుతుంటారు. వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఇద్దరూ కలిసి చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబును ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ కూడా చేసేశారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను సంపాదించిన సితార పాపకు పలువురు హీరోయిన్స్‌ కూడా ఫిదా అయిపోయారు. ఇక ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్‌ ఫంటాస్టిక్ తారకు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంది. మహేశ్‌ ముద్దుల తనయగా తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్న సితార ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ నీకెవ్వరూ తర్వాత ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం వంటి హిట్ సినిమాను అందించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.