నోనిపండు..అనారోగ్య సమస్యలన్నీ పరార్!

117
- Advertisement -

నోనిపండు.. దీనినే తొగరు పండు అనికూడా అంటారు. ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కాస్త ఒగరు రుచిని కల్గి ఉండే ఈ పండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. కేవలం పండులోనే కాక.. ఈ పండు యొక్క చెట్టు ఆకులలోనూ, ఖండంలోనూ దాదాపు వందకు పైగా వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నోనిపండులో యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ పండులో బీటా గ్లూకన్స్, కంజుగేటెడ్ లీనోలెయిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండు తింటే ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. .

ఇక సంతనలేమీ సంస్యను తగ్గించడంలో కూడా ఈ నోని పండు కీలక పాత్ర పోసిస్తుంది. పురుషుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే నపుంసకత్వం, స్త్రీలలో వచ్చే వందత్వమ్, వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని కూడా పెంచుతుంది. ఇక నోని పండులో ఉండే హెపటోప్రొటెక్టివ్.. కాలేయ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. తక్షణ శక్తి కోసం ఈ నోని పండును జ్యూస్ గా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనలు కలుగుతాయట. బీపీని కంట్రోల్ లో ఉంచడంతో పాటు షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అంతే కాకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ, మానసిక ఒత్తిడిని దూరం చేయడంలోనూ నోని పండులో ఉండే ఔషధ గుణాలు చక్కగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నోనిపండును తినడం ఎంతో మంచిదట. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, హై బీపీ మందులు వాడే వాళ్ళు ఈ నోనిపండు తినరాదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!

- Advertisement -