పొగ తాగకున్న క్యాన్సర్ ముప్పు!

1
- Advertisement -

ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఊపిరితిత్తుల క్యాన్సర్​ అనగానే పొగ తాగే వారికి మాత్రమే వస్తుందనే భావనలో ఉంటారు కానీ ఇప్పుడు పొగ తాగనివారిలోనూ దీని కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గాలి కాలుష్యం, ఇతరులు వదిలిన సిగరెట్ల పొగను పీల్చుకోవడం, పనిచేసే చోట హాని కారకాలు, ఇంట్లో వంటల నుంచి వెలువడే పొగలు, జన్యువుల వంటివన్నీ ఇందుకు తోడ్పడుతున్నాయి.

Also Read:షర్మిల..పోస్టు కార్డుల ఉద్యమం

సిగరేట్ తాగే వారి పక్కన ఉండి ఆ పొగను పీల్చుకునే నాన్ స్మోకర్స్​లో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% పెరిగిందని కనుగొన్నారు పరిశోధకులు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

- Advertisement -