కాంగ్రెస్ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి షాక్ తగిలింది. చీటింగ్ కేసు విషయంలో కోర్టు నోటీసులకు స్పందించక పోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఖమ్మం న్యాయస్థానం. 2014 ఎన్నికల సమయంలో వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాంజీ నాయక్ కి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని రేణుకా చౌదరి డబ్బులు తీసుకుందని కానీ ఆ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై డాక్టర్ రాంజీ నాయక్ మృతి చెందాడని రాంజీ నాయక్ భార్య కళావతి అనేక సార్లు ఢిల్లీ ఏఐసీసీ నాయకులకు,రాష్ట్ర నాయకత్వానికి కంప్లైంట్ ఇచ్చింది.
కానీ కాంగ్రెస్ నేతలు ఎవరు దీనిపై స్పందించలేదు. దీంతో కళావతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రేణుకా చౌదరిపై ఎస్సి ఎస్టీ కేసు పెట్టింది..అయితే కేసు సంబంధించి ఎటువంటి రుజువులు లేకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు.
దీంతో కళావతి తమను రేణుకా చౌదరి మోసం చేసిందంటూ కోర్టులో చీటింగ్ ఫిటీషన్ వేసింది.అది అప్పటి నుండి కోర్టు లో నడుస్తున్నది..గత రెండురోజుల క్రితం ఖమ్మం లోని రేణుకా చౌదరి కార్యాలయముకు నోటీసులు పంపారు…కోర్టుకి రేణుకా చౌదరి హాజరు కాకపోవడంతో ఖమ్మం నగరంలో ప్రధమశ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి జయమ్మ రేణుకా చౌదరి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.