జూన్‌ 14 నుంచి ‘బడిబాట’..

245
TS Schools Badi Bata

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేయడం,బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదుసంఖ్య పెంచడం, విద్యాభివృద్ధి పథకాలను సక్రమంగా అమలయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం.. ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ కార్యక్రమం జూన్‌ 14న ప్రారంభమై 19 వరకు కొనసాగనుంది. ఇది ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. బడిబాటలో రోజువారీగా చేపట్టాల్సిన వాటితోపాటు ‘ప్రారంభానికి ముందు సంసిద్ధత’కు సంబంధించిన మార్గదర్శకాలను శాఖ కమిషనర్‌ వెల్లడించారు.