వేసవి రద్దీ..వీఐపీ బ్రేక్ రద్దు

18
- Advertisement -

వేసవి సెలవుల్లో విపరీతమైన రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేసింది.క్యూలు మరియు కంపార్ట్‌మెంట్లలో నిరంతరం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం మరియు వైద్య సదుపాయాలను అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఆలయ మాడవీధుల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా షేడ్స్, కూలెంట్లు, కార్పెట్‌లతో పాటు ఎప్పటికప్పుడు నేలపై నీళ్లు చల్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

నారాయణగిరి గార్డెన్స్, ఆలయ పరిసరాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు టీటీడీ తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది.జూన్ 1 నుంచి 5 వరకు ఆకాశ గంగ, శ్రీ బేడి ఆంజనేయ స్వామి, ఏడో మైలు ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు, జూన్ 2న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం, నాద నీరాజనం వేదికపై ప్రత్యేక ప్రసంగాలు తదితర కార్యక్రమాలు ఉండనున్నాయి.

Also Read:ఒకే వేదికపై రెండు సినిమాలు

- Advertisement -