Bunny:బన్నీ ‘పుష్ప 2’.. బాధాకరం?

24
- Advertisement -

‘అల్లు అర్జున్’ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ షూటింగ్ వేగంగా నడుస్తోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి గానీ, అఫీషియల్ అప్ డేట్స్ – పోస్టర్స్ మాత్రం రావడం లేదు. సుకుమార్ కూడా మీడియాకి దూరంగా సైలెంట్ గా ఉంటున్నాడు. మొత్తానికి, పుష్ప 2 పై మేకర్స్ సైలెన్స్ ని అల్లు అర్జున్ అభిమానులు భరించలేకపోతున్నారు. సుకుమార్ – బన్నీ కాంబోలో భారీ ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ గురించి కొత్త ముచ్చట్లు.. మరీ ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ కహానీలు లేకపోవడం బాధాకరం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

‘పుష్ప 2’ వండర్స్ అంటూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే హడావుడి చేశారు. అందుకు తగ్గట్టుగానే, షూటింగ్ మొదలయ్యాక చిన్నపాటి బ్రేక్ కూడా లేకుండా అల్లు అర్జున్ అండ్ టీమ్ కష్టపడుతుంది. ఈ లెక్కన పుష్ప 2 నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ అప్ డేట్స్ రావాలి కదా. అలా మాత్రం జరగడం లేదు. అసలు మెయిన్ టీజర్ జనవరిలో రిలీజ్ అన్నారు. కానీ, టీజర్ రాలేదు. ఆ తర్వాత సాంగ్ గురించి అప్ డేట్ ఉంటుంది అన్నారు. అదీ కూడా లేదు.

దీనిని బట్టి, పుష్ప 2 విడుదల పోస్ట్ పోన్ అయినట్లే అంటూ కొత్తగా కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 పై అప్ డేట్స్ అంత ఫాస్ట్ గా విడుదల కాకపోవడం పై, అలాగే సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తల పై బన్నీ ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. మరోవైపు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఎలాగూ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి పుష్ప 2తో ఏమవుతుందో చూడాలి.

Also Read:ప్రోటీన్ లోపాన్ని గుర్తించండిలా!

- Advertisement -