కేసీఆర్ బర్త్ డే..వృక్షార్చన:ఎంపీ సంతోష్

15
- Advertisement -

తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అధినేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఉద్యమనేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘వృక్షార్చన’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

రాష్ట్రం, దేశం పచ్చగుండాలనే సంకల్పంతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ భాగస్వాములై , ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ కి జన్మదిన కానుకను ఇద్దామని జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.

భవిష్యత్ తరాల సంక్షేమం కోసం పనిచేసే దార్శనిక నేత శ్రీ కేసీఆర్ గారు మానవాళికి పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి. విజయవంతం చేశారన్నారు. తెలంగాణ హరితహారంను దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిపారన్నారు. చెట్లు నాటడం, పరిరక్షించే కార్యక్రమాన్ని ఉద్యమ స్పృహతో సాంగించిన గొప్ప నాయకుడైన శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజు అందరికీ పండుగనేనని జోగినపల్లి అన్నారు. దేనినైనా ఉన్నతస్థాయిలో ఆలోచించడమే గాకుండా త్రికరణశుద్ధితో ఆచరించే మహానేత శ్రీ కేసీఆర్ గారని ఆయన తెలిపారు. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని జోగినపల్లి కోరారు.

Also Read:TTD:తిరుమలలో వైభవంగా రథసప్తమి

- Advertisement -