Roja:రోజాకు నో టికెట్?

29
- Advertisement -

వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఈసారి టికెట్ లభించే అవకాశం లేదా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు రోజా. ఫలితంగా 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు ఆమెనే గెలిపించారు. కానీ 2019 తర్వాత సీన్ రివర్స్ అయింది. స్థానిక వైసీపీ నేతల నుంచి అమెకు ప్రతికూలత ఎదురవుతూ వచ్చింది. నగరిలోని సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని స్వయంగా రోజా చాలాసార్లు చెప్పుకొచ్చారు..

అయినప్పటికి రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి కేటాయించారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఆమె మంత్రి పదవి చేపట్టిన తరువాత నియోజక వర్గంలో భూ కబ్జాలు, అవినీతి, దోపిడీ.. ఇలా చాలా అక్రమాలు జరిగాయని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆమె గతంలో మాదిరి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని నగరి నియోజకవర్గ వైసీపీ నాయకులు అధిష్టానానికి ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. దీంతో రోజా టికెట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

సొంత నేతలే ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తామని బహిరంగంగా చెప్పడంతో రొజాకు టికెట్ ఇచ్చిన లాభం లేదనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి రొజాను పక్కన పెట్టె అవకాశాలు కనిపిస్తున్నట్లు టాక్. ప్రత్యర్థి పార్టీ నేతలపై తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడి పెంచే రొజాకు టికెట్ ఇవ్వకపోతే.. ఆమె పార్టీ వీడిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఆర్కే రోజా విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read:న‌యా దేశ్‌ముఖ్..రేవంత్ రెడ్డి

- Advertisement -