ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం (ఆర్ఆర్ఆర్) రౌద్రం రణం రుధిరం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి పాత్రలో చరణ్ నటించిన వీడియో ప్రోమోను ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ రెండింటికీ ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తారక్ పుట్టినరోజు మే 20 సందర్భంగా కొమురం భీమ్ పాత్రలో తారక్ వీడియో ప్రోమో కోసం తారక్ అభిమానులు ఆసక్తిగాఎదురు చూడటం ప్రారంభించారు. అయితే ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.
‘లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు.. పనులు ఆగిపోయాయి.. అయినప్పటికీ మేము వీలైనంత ప్రయత్నించాం. తారక్ బర్త్ డేకి ట్రీట్ ఇవ్వాలని భావించాం. కానీ, వీడియోకు సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయాం’ అంటూ ఆర్ఆర్ఆర్ ప్రకటన చేసింది. దీంతో ఎన్టీఆర్ బర్త్ డేకు వీడియోగానీ, ఫస్ట్‌లుక్ గానీ విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
ఏదో ఒకటి విడుదల చేసేయాలన్నది తమకు ఇష్టం ఉండదని, మీ ఎదురుచూపులకు తగ్గా రీతిలో అది ఉంటుందని ప్రామిస్ చేస్తున్నామని పేర్కొంది. అది ఎప్పుడు వచ్చినా, మనందరికీ ఒక పెద్ద పండగలా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తెలిపింది. అయితే, ఈ ప్రకటనపై ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
As the lockdown gets extended time and again, work has come to a dead stop. And though we tried our best, we couldn’t finish work on a glimpse of @tarak9999 to give you all a treat on his birthday!
And so, we will not be releasing either a first look or a video on the occasion.— RRR Movie (@RRRMovie) May 18, 2020