రాహుల్‌ పై హత్యాయత్నం..!

357
Rahul
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ మండిపడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసిన కాంగ్రెస్ ఉత్తర్‌ప్రదేశ్ ఆమేథీలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో రాహుల్ మాట్లాడే సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన నుదుటిపై లేజర్ ఫోకస్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. రాహుల్‌ తలపై కనీసం ఏడుసార్లు ఆకుపచ్చ రంగు లేజర్‌ లైట్‌ తాకిందనీ, ఇలాంటి లేజర్‌ను స్నైపర్‌ తుపాకుల్లోనే వాడతారని ఆందోళన వ్యక్తం చేసింది.

కాంగ్రెస్‌ నేతలు అహ్మద్‌పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్‌ సూర్జేవాలా సంతకం చేసిన ఈ లేఖలో రెండు సార్లు రాహుల్‌ కణతపైనే గురిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన మాజీ భద్రతాధికారులు.. ఇలాంటి లేజర్‌ లైట్లు కేవలం స్నైపర్‌ గన్‌లాంటి అత్యాధునిక ఆయుధాల్లోనే ఉంటాయని తేల్చారు. ఇలాంటి ఘటన జరగడం రాహుల్‌ గాంధీ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీ వాదనను కేంద్ర హోంశాఖ ఖండించింది. ఆయన ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. రాహుల్‌పై పడిన లైట్‌ ఆకుపచ్చ రంగు లేజర్‌ లైట్‌ ఏఐసీసీ ఫొటోగ్రాఫర్‌ ఫోన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు.

- Advertisement -