TTD:శ్రీవారి సిఫారసు లేఖలు రద్దు

17
- Advertisement -

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు శనివారం నుండి తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

కావున భక్తులు మరియు విఐపిలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Also Read:లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

- Advertisement -