చరణ్ అందుకే సైరాలో నటించలేదట..!

507
sye raa
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.బాలీవుడ్,కోలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ఈ మూవీలో నటించడంతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో అయన ఓ పాత్ర చేయాల్సి ఉందట. ఆ పాత్ర పేరు షేర్ ఖాన్. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆ పాత్రలో సల్మాన్ లేదంటే సంజయ్ దత్ చేత చేయిద్దామని అనుకున్నారట. కానీ వీరిద్దరు నటించడం కుదరలేదు.

ఈ పాత్రను రాంచరణ్ చేత చేయిద్దామని అనుకున్నారు. అయితే ఇంటర్వెల్‌కు ముందు ఆ సీన్ ఉండాలి. మెగాస్టార్ తో ఆ పాత్ర ఫైట్ చేస్తుంది. ఇలా చేస్తే చరణ్ ఫ్యాన్స్ ఫీలవుతారని భావించి ఆ పాత్రను పక్కన పెట్టేశారట. అంతేగాదు అసలు ఆ పాత్రే సినిమాలో అవసరం లేదని తీసేశారట.

- Advertisement -