పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దే కాల్ హిమ్ OG సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రియాంకా మోహన్ కథానాయికగా నటించారు.
ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలకు ముందు ప్రత్యేక ప్రీమియర్ షోలు ఉంటాయని అభిమానులు ఊహించారు. అయితే తాజా టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలాంటి ప్రీమియర్లు జరగకపోవచ్చు. బదులుగా విడుదల రోజు అర్ధరాత్రి 1 గంట, ఉదయం 4 గంటలకే షోలు ప్రారంభం కానున్నాయని చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఇదే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ చిత్రంలో ఎమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనుండగా, ప్రకాశ్‌రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందిస్తుండగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
Also Read:ప్రభాస్-ప్రశాంత్ వర్మ..గేమ్ ఆన్!

