- Advertisement -
సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. దేశంలో ఉన్న పేదరికం కావచ్చు.. రైతుల సమస్యలు కావచ్చు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి మేము చర్చించాం అన్నారు. మీడియాతో మాట్లాడిన పవార్.. సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు సీఎం కేసీఆర్. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత…. దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదు. దళితుల వికాసం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేదు. అందుకే దేశం కోసం.. సరైన అజెండ ఉండాలన్నారు.
కొన్ని రోజుల తర్వాత ప్రజల ముందు మా అజెండ పెడతాం.. మా కార్యచరణ ఏంటో త్వరలోనే తెలియజేస్తాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
- Advertisement -