పార్కింగ్ ప్లేస్ లేదా..? అయితే కారు కొనరాదు..

345
car parking
- Advertisement -

రోజు రోజుకు నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరు సొంత వాహనాలను కొనుక్కోవడం. అయితే ఇంటి ఆవరణలో పార్కింగ్ కి ప్లేస్ లేకున్నా కార్లు కొంటున్నారు. పార్కింగ్ కి ప్లేస్ లేకపోవడంతో రోడ్లపై పార్కింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇంటి ఆవరణలో కారు పార్కింగ్ కి స్థలం లేని వారు ఇక ముందు కారు కొనే అవకాశం ఉండకపోవచ్చని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తమ్మన్న సూచించారు.

car parking

చాలా మంది వారి వాహనాలను రోడ్లపై పార్క్ చేయడం వల్లన ట్రాఫిక్ కు అంతరాయం కల్గుతోందని మంత్రి అన్నారు. రోడ్లు ప్రజలందరి కోసం అని కొందరి వ్యక్తుల వల్లన అందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కార్లు కొనడం వలన నగరంలో పార్కింగ్ సమస్య పెరుతుందన్నారు. కావున సొంత వాహనాలను కొనడం కంటే.. ప్రజా రవాణా వినియోగంపై ఆధారపడాలని సూచించారు.

ఈ విషయంపై ముందుగా ప్రజలలో అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పార్కింగ్ సమస్యను నివారించేందుకు ప్రజలు మాతో కలిసి వస్తారని భావిస్తున్నానని చెప్పారు. దేశంలో తొలిసారిగా ఇటువంటి నిబంధనలు తీసుకురానున్న కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

- Advertisement -