ఆఫర్లు లేవ్.. ఇక ఐటమ్ సాంగ్సే దిక్కు

37
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో పేరు రావడం ఎంత కష్టమో… వచ్చిన ఆ పేరును నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి పెద్దగా సమయం పట్టదు. రెండేళ్ల క్రితం వరకు పూజ హెగ్డే డేట్స్ కోసం ఎగబడ్డారు దర్శకనిర్మాతలు. గతేడాది వరకు రష్మిక మందన్నా అంటే పడిచచ్చారు నిర్మాతలు. ఇప్పుడు జాన్వీ కపూర్ డేట్స్ కోసం ఎగబడుతున్నారు. రానున్న రెండేళ్లలో సౌత్ లో జాన్వీ కపూర్ లీడ్ హీరోయిన్ గా మారబోతుంది. అనంతరం శ్రీలీల పేరు వినిపిస్తోంది.

మొత్తమ్మీద ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్ల కెరీర్ ట్రాక్ తప్పడానికి, ముఖ్యంగా వారి అదృష్టం తారుమారు కావడానికి ఆరు నెలలకు మించి ఎక్కువ టైమ్ పట్టలేదు. అయితే, హీరోయిన్ రాశి ఖన్నా పరిస్థితి మరీ దారుణం. ఆమెకు స్టార్ డమ్ రాలేదు. రాకపోయినా.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. శక్తివంచన లేకుండా అందాల ఆరబోతలో కూడా హద్దులు గట్రా లేకుండా జాగ్రత్త పడింది. అయినా, ఇప్పుడు ఆమెని తమ సినిమాలో నుంచి తొలగిస్తున్నారు. రాశి ఖన్నా చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది.

Also Read:బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసిన బీఆర్ఎస్..

ఇలాంటి గడ్డు పరిస్థితిల్లో ఉంది రాశి ఖన్నా సినీ కెరీర్. నిజానికి ఈ భామ మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ కోసం మిడ్ రేంజ్ హీరోల సరసన నటించింది. ఆ సినిమాలు కాస్త ప్లాప్ అయ్యాయి. దాంతో.. రాశి ఖన్నా సక్సెస్ ట్రాక్ ప్లాప్ వైపు వెళ్ళింది. రాశి ఖన్నా కూడా ఫేడ్ అవుట్ అండ్ మిడ్ రేంజ్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. ఫైనల్ గా రాశి ఖన్నా మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది. కానీ, నిర్మాతలు మాత్రం కొత్త భామల వైపు చూస్తున్నారు. దాంతో రాశి ఖన్నాకి కొత్తగా ఆఫర్లు రాలేదు. అందుకే, ఐటమ్ సాంగ్స్ వైపు కూడా మళ్లాలని రాశి ఖన్నా ఆలోచనలో ఉందట. మరి రాశి ఖన్నా ఎలాంటి ఐటమ్స్ చేస్తోందో చూడాలి.

Also Read:మెగాస్టార్‌కి సర్జరీ నిజమే!

- Advertisement -