చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ‘ప్రగ్యా జైస్వాల్’ పరిస్థితి. బాలయ్య ‘అఖండ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ వచ్చాక, ఇక కెరీర్ అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ తన రెమ్యునరేషన్ ను విచ్చలవిడిగా పెంచేసింది. ఎలాగూ భారీ హిట్ పడింది, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది ప్రగ్యా. ఈ క్రమంలోనే అఖండ తర్వాత వచ్చిన ఆఫర్లను ప్రగ్యా జైస్వాల్ తన ఎడమ కాలితో ఛీ కొట్టింది. తనకు అంత కావాలి, ఇంత కావాలి అంటూ భారీ డిమాండ్లను నిర్మాతల మెడకు చుట్టాలని తెగ ఉబలాట పడింది.
కట్ చేస్తే.. ప్రగ్యా జైస్వాల్ డిమాండ్లకు నిర్మాతలు తలోగ్గలేదు. దాంతో ప్రగ్యా జైస్వాల్ కి వచ్చిన ఆఫర్లు కూడా మిస్ అయ్యాయి. దాంతో తెలియకుండానే గ్యాప్ వచ్చేసింది. అఖండ తర్వాత బాలయ్య ఒక సినిమా రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు పట్టలెక్కించాడు. కానీ, ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేక పోయింది. ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రగ్యా జైస్వాల్ రోజురోజుకు దిగజారిపోతూ ఉంది. ఐతే, ఆల్ రెడీ చేతులు కాలాయి. కాబట్టి ఈ బ్యూటీకి బొబ్బలెక్కేయి. ముందు జాగ్రత్తగా ఉంటే చేతులు కాలవు కదా. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్’ ఛాన్స్ ల కోసం హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటుంది.
తన కెరీర్ పట్ల ప్రగ్యా జైస్వాల్’ తెగ ఫీల్ అయిపోతుంది. ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ను చూస్తుంటే. డిమాండ్ ఎక్కడ ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి”. ఇలా చేతులు కాలేకా అకులు పట్టుకుని ఉపయోగం లేదు ప్రగ్యా, అలా పట్టుకుంటేనే బొబ్బలెక్కుతాయి’. ప్రగ్యా జైస్వాల్ ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రగ్యా జైస్వాల్ తన కెరీర్ ను మళ్ళీ ట్రాక్ పై పెట్టుకోడానికి కసరత్తులు చేయాలి. ఇంతకీ.. ప్రగ్యా జైస్వాల్ ఆశ నిరాశ అవుతుందో.. లేక, సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..