త్రివిక్రమ్ తో గ్యాపే కొంప ముంచింది

29
- Advertisement -

‘పూజా హెగ్డే’ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. ఐతే, గత కొన్ని సినిమాలుగా ఆమెకు ఉన్న క్రేజ్ కి, ఆమె ఇమేజ్ కి తగ్గ విజయం మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే వరుసగా ఫ్లాపులే. పూజా హెగ్డే కొత్త సినిమా “కబీ ఈద్ కబీ దివాలీ” ఆ మధ్య విడుదలైంది. మొదటి వీకెండ్ ఈ సినిమాకి పాతిక కోట్లు రావడం గగనం అయ్యింది. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్ రావడం ఆ మధ్య ఇది హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి ఈ సినిమా ఫలితంతో పూజా హెగ్డే కి బాలీవుడ్ లో కూడా కష్ట కాలం అయిపోయింది.

2024లో పూజా హెగ్డే కి మరో కొత్త సినిమా రాలేదు. గతేడాది వరకూ ఆమెకు ఫుల్ డిమాండ్ ఉంది. పూజా హెగ్డే నటించిన చిత్రాలకు సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఎప్పుడైతే గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించారో.. అప్పటి నుంచి ఆమెకు ఎలాంటి క్రేజ్ లేకుండా పోయింది. ఆ మాటకొస్తే పూజా హెగ్డే అందుకున్న చివరి సాలిడ్ హిట్ మహర్షి. వరుసగా మూడేళ్ళుగా అపజయాలే. సినిమాకి 5 కోట్లపైనే తీసుకునే ఈ భామకి విజయాలు తగ్గిపోతుండడంతో ఇప్పుడు రెండు కోట్లు ఇవ్వడానికి కూడా ఏ నిర్మాత ముందుకు రావడం లేదు.

మొత్తానికి పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారు అయ్యింది. ఎప్పుడైతే పూజా హెగ్డేకి – త్రివిక్రమ్ కి మధ్య గ్యాప్ పెరిగిందో అప్పటి నుంచి పూజా హెగ్డేకి డిమాండ్ తగ్గింది. మరి పూజా హెగ్డే ఇప్పటికైనా త్రివిక్రమ్ తో ఉన్న గ్యాప్ తగ్గించుకుని.. మళ్లీ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి.

Also Read:ఓటీటీ :ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -