గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం,నామినేషన్‌కు రేపే ఆఖరి తేది కావడం…15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియనుంది. ఇక డిసెంబర్ 1న ఎన్నికలు జరగనుండగా ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఎన్నికల కమిషన్.
మాస్క్ లేకుంటే ఓటు వేసేందుకు అనుమతిచ్చే ప్రసక్తేలేదని తెలిపిన ఈసీ… ఎన్నికల సామగ్రి పంపిణి, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
ఓటర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలి. సర్కిళ్లలో ఓటర్లు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి ముందు ఒక ఓటరు నిలబడేలా మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. ఒకే మార్గంలో రెండు పార్టీల రోడ్ షోలు ఉంటె రెండింటి మధ్య తేడా కనీసం అరగంట టైమ్ గ్యాప్ ఉండేలా చూడాలని… నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు అధికారులు.