ఢిలీలో లాక్ డౌన్‌ విధించం- సీఎం కేజ్రీవాల్

199
Kejriwal
- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కాగా,దేశ రాజధాని ఢిలీలో కరోనా విజృంభిస్తోంది. అయితే ఢిల్లీలో మళ్ళీ లాక్‌ డౌన్‌ ఉంటుందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా లాక్‌ డౌన్‌పై ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్‌పై ఎలాంటి ఆలోచన లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌, ఇతర అధికారులతో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 3,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గురువారం 71 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు సీఎం వివరించారు.

- Advertisement -