‘వైల్డ్ డాగ్’ అద్భుతంగా ఉంది- సమంత

217
Samantha Akkineni
- Advertisement -

కింగ్‌ నాగార్జున తాజాగా నటించిన సినిమా ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీ శుక్రవారం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్ అయ్యింది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీపై మీడియాలో రివ్యూలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా నాగార్జున కోడలు, హీరోయిన్‌ సమంత కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని చూశానని, అద్భుతంగా ఉందని కొనియాడారు.

చాలాకాలంగా యాక్షన్ సినిమాలను మిస్సవుతున్నానని, ఆ లోటును ‘వైల్డ్ డాగ్’ చిత్రం తీర్చిందని వెల్లడించారు. యాక్షన్, భావోద్వేగాలతో హాలీవుడ్ స్టయిల్లో ఈ సినిమా ఉందని, అన్ని అంశాల కలబోతగా సాగిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని సమంత పిలుపునిచ్చారు. ఇక తన మామగారైన నాగార్జున నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరూ పోషించలేరని తెలిపింది. వైల్డ్ డాగ్ చిత్రయూనిట్ కు ఆమె అభినందనలు తెలియజేశారు.

- Advertisement -