ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదు- సీఎం కేజ్రీవాల్

114
- Advertisement -

ప్రజలు మాస్క్‌లు ధరించడం, కోవిడ్ నియమాలు పాటిస్తే లాక్ డౌన్ అవసరం ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, కోవిడ్ నియమాలు పాటిస్తే లాక్ డౌన్ అవసరం ఉండదు.

మేము లాక్‌డౌన్ విధించాలనుకోవడం లేదు. నేటి హెల్త్ బులెటిన్‌లో దాదాపు 22,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. గత వేవ్‌లోని డేటాను విశ్లేషించిన తర్వాత చెబుతున్నాం. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటోందిని సీఎం తెలిపారు.

- Advertisement -