రమేష్ బాబు మృతి పట్ల చిరు దిగ్భ్రాంతి..

15

నిన్న సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు,మహేష్‌ బాబు అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మహేష్‌ బాబు కుటుంబంలో తీరని విషాదం నెలకొల్పింది. రమేష్‌ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషాద ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

‘శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యి ఎంతో బాధ పడ్డాను. శ్రీ కృష్ణ గారు, మహేష్ మరియు వారి కుటుంబం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ హృదయ విదారక నష్టాన్ని తట్టుకునే విధంగా ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టరలో పోస్ట్ చేశారు.