Samantha:ఐటం సాంగ్ వద్దన్నారు

42
- Advertisement -

సమంత ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతానికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తన వైవాహిక బంధంలో తాను పూర్తిగా నిజాయితీగా ఉన్నానని, అయితే దురదృష్టవశాత్తూ అది సరిగ్గా కుదరలేదని సమంత పేర్కొంది.

విడాకుల తర్వాత సమంతకు ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా’ పాటలో అవకాశం వచ్చింది. అయితే బ్రేకప్ అయిన వెంటనే ఇలాంటి పాటలు తీసుకోవద్దని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు సలహా ఇచ్చారు. ఆమెకు శ్రేయోభిలాషులు కూడా అదే సూచించారు.

‘‘తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తనను ఇంటికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని సమంత పేర్కొంది.

“నేను ఏ తప్పు చేయకుంటే ఎందుకు క్షమించాలి?” నటి పేర్కొంది. అందుకే పుష్పలోని పాటకు ఓకే చెప్పాను’’ ఐటం సాంగ్ కూడా ఒక కేరెక్టర్ లాగే చూస్తాను అంటూ సామ్ చెప్పుకుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -