రాజకీయాల్లోకి వస్తే నా భార్య నన్ను వదిలేస్తానందిః రఘురామ్ రాజన్

261
rafhuram rajan politics
- Advertisement -

తాను రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తానని చెప్పిందన్నారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే తన భార్య విడాకులు ఇస్తానని బెదిరించిందన్నారు. మనం పనిచేసే ప్రతిచోటు రాజకీయాలుంటాయన్నారు.

ప్రస్తుతం తాను ఉపాధ్యాయుడిగా బిజీగా ఉన్నానని…ఈఉద్యోగం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. మోడీ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు రఘురాం రాజన్. అప్పట్లో యూపిఎ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో..ఇప్పడు ఎన్టీయే ప్రభుత్వం కూడా అవే తప్పులు చేస్తుందని ఆరోపించారు.

తాను ఏపార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని..తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు రాఘురాం రాజన్.

- Advertisement -