ఫిఫా..సెక్సీ అమ్మాయిలే టార్గెట్..!

343
fifa honey shots
- Advertisement -

రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పసికూన క్రొయేషియా ఫైనల్‌ చేరి ఫ్రాన్స్‌తో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా సాకర్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిఫా బ్రాడ్‌కాస్టర్‌లకు పలు ఆంక్షలు విధించింది.

అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బ్రాడ్‌కాస్టర్‌లు కెమెరాలతో జూమ్ చర్యలు తప్పవని హెచ్చరించారు ఫిఫా నిర్వాహకులు. టెలివిజన్‌ల తీరుపై ఫిఫా చీఫ్ ఫెడరికో అడెక్కీ మండిపడ్డారు. ప్రస్తుత ప్రపంచకప్‌ టోర్నీలో సెక్సీ అమ్మాయిలను బ్రాడ్‌కాస్టర్‌లు పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని తెలిపారు. సెక్సీ జూమ్ ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందని ఫిఫా దీనికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Related image

ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించదని…వీటిపై త్వరలో ఓ పాలసీ రూపొందించి ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అయితే,1970ల్లోనే హానీ షాట్స్‌ పేరుతో సెక్సీ అమ్మాయిలను జూమ్ చేయడం మొదలైంది. ఫుట్‌బాల్‌లోనే కాదు క్రికెట్‌లోనూ సెక్సీ అమ్మాయిలను జూమ్ చేయడం…వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిఫా పలు ఆంక్షలను విధించింది.

- Advertisement -