Nithin:ప్చ్.. నితిన్ పరిస్థితి మళ్లీ మొదటికి!

46
- Advertisement -

హీరో నితిన్ ను సినిమా ఇండస్ట్రీలో పడిలేచిన కరాటం అంటుంటారు. అలాంటి నితిన్ కి ఇప్పుడు మళ్లీ కష్టకాలం మొదలైందా? అంటే అవుననే చెప్పాలి. ఒకప్పుడు వరుస ప్లాప్స్ తో కెరీర్ అయిపోయిందని అనుకుంటున్న సమయంలో, తిరిగి మళ్ళీ పుంజుకున్న నితిన్, “అ ఆ”, భీష్మ వంటి హిట్స్ తో లైన్ లోకి వచ్చాడనేల పేరు తెచ్చుకున్నాడు. ఫాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ మధ్య నితిన్ కు వరుస ప్లాప్స్ ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ఎక్సట్రా-ఆర్డినరీ మాన్ కూడా దారుణంగా పరాజయం పాలైయింది.

నిజానికి, భీష్మ తర్వాత నితిన్ కెరీర్ లో మళ్లీ హిట్ లేదు. అసలు ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు అంగీకరించిన సినిమాలన్నీ భారీ ప్లాప్స్ అందుకున్నాయి. రంగ్ దే, మాస్ట్రో, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఇలా వరుసగా నితిన్ డిజాస్టర్ల సినిమాలు ఇచ్చాడు. దీంతో, వినాయక్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. తాజాగా అది ఆగిపోయిందని అంటున్నారు. భీష్మ సినిమాతో నితిన్ ఫామ్ ని తెలియ చేసిన వెంకీ కుడుములతో అనుకున్న మరో సినిమా కూడా బడ్జెట్ కారణంగా కుదేలు అవుతుంది. చాలా బడ్జెట్ పరిమితుల మధ్య ఈ సినిమాని లాగుతున్నారు.

మొత్తానికి నితిన్ డిమాండ్ రోజురోజుకు తగ్గిపోతుంది. దీనికి, నితిన్ స్వయంకృతాపరాధం కూడా కారణంగా తెలుస్తోంది. వరుస ప్లాప్స్ వస్తున్నా.. రెమ్యునరేషన్ విషయంలో నితిన్ తగ్గకపోవడం కూడా ఈ ప్లాప్స్ కి కారణంగా తెలుస్తుంది. అలాగే, కథల పై ఎలాంటి కసరత్తులు చేయకుండా గుడ్డిగా దర్శకులను నమ్మడం కూడా నితిన్ పాలిట శాపం అయ్యింది. చూద్దాం నితిన్ భవిషత్తు ఎలా ఉండనుండో? !!.

Also Read:పిక్ టాక్ : ఆ అందాలతో సోకుల విందు

- Advertisement -