నేటి నుంచి సినిమా థియేటర్లు బంద్

215
cinematheatres
- Advertisement -

డిజిటల్ ప్రొవైడర్లు.. దక్షిణాది సినీ పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నారని, బాలీవుడ్ కంటే ఎక్కువ ఛార్జీలు వసూళ్లు చేస్తూ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ఆరోపించింది. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కమిటీ ఛైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. డిజిటల్ విధానం మొదలైన ఐదేళ్లకే వర్చువల్ ప్రింట్ ఫీజ్ (వీపీఎఫ్) ఛార్జీలను రద్దు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉన్నా, ఇక్కడ మాత్రం అమలు చేయడం లేదు’’ అని తెలిపారు.

d-suresh-babu

రెండు నెల‌ల నుంచి డిజిట‌ల్ ధ‌ర‌లు భ‌యంక‌రంగా పెంచేశారని, ఈ నేప‌థ్యంలో జాయింట్ యాక్షన్ క‌మిటీ ఏర్పాటు చేశామన్నారు. క‌మిటీ ఛైర్మన్‌గా డి.సురేష్ బాబు, క‌న్వీన‌ర్‌గా పి. కిర‌ణ్‌ బాధ్యత‌లు తీసుకున్నట్లు చెప్పారు. కమిటీ ఏర్పాటు కంటే ముందు ఆరేండ్ల నుంచి సురేష్ బాబు, సి.క‌ల్యాణ్, ఎన్.వి ప్రసాద్ క‌లిసి పోరాటం చేసినా డిజిట‌ల్ యాజ‌మాన్యాలు దిగిరాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. జేఏసీ ఆధ్వర్యంలో హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరులో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మా‌న్యాలతో ప‌లు అంశాల‌పై చర్చలు జ‌రిపితే.. అవి విఫ‌ల‌మ‌య్యాయన్నారు.

No films release from March 2

ఇవాళ ఉద‌య‌మే తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా… ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ప్రభుత్వం త‌రఫున ఎప్పుడూ స‌హ‌కారం ఉంటుంద‌ని మంత్రి తలసాని భ‌రోసా ఇచ్చారన్నారు. మా పోరాటానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న అన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు పూర్తిగా మ‌ద్దతు ఇచ్చినట్లు తెలిపారు. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, పంపిణీ దారులు అంతా ఒకే తాటిపైకి వ‌చ్చి పోరాటం చేయ‌డానికి సిద్ధమ‌య్యాం. థియేట‌ర్లలో సినిమాల ప్రదర్వన నిలిపివేత ఎన్ని రోజులు కొన‌సాగుతుందో చెప్పలేమన్నారు. తమ పోరాటానికి ప్రేక్షకులు కూడా స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -