పండుగ వాతావరణంలో గణేష్ చవితిని జరుపుకోవాలి- మంత్రి

95
Minister Indrakaran Reddy
- Advertisement -

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ కలెక్టర్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై సోమవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. గణేష్ ఉత్సవాల వద్ద భక్తి వాతవరణం నెలకొనేలా చూడాలని సూచించారు. బంగల్ పెట్ వినాయక సాగర్ వద్ద భారీ క్రేన్ లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.పట్టణంలోని గుంతలను పూడ్చి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచండి..
సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆ సౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు విద్యాశాఖ అధికారులతో సోమవారం కలెక్టర్‌ ముషారఫ్ అలీతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తరగతి గదులను శుభ్రం చేసి శాని టైజ్ చేయాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలను విద్యార్థులు ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు మంత్రి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల్లో జ్వరాలు ఉన్నవారిని ముందే గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -