- Advertisement -
పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్‌ఖర్ వైఖరే కారణమని ఆరోపించిన విపక్ష ఎంపీలు ఇవాళ ఉదయం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.
ఇండియా కూటమి పార్టీలైన తృణమూల్, ఆమ్ ఆద్మీపార్టీ, సమాజ్ వాదీపార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 50 మందికిపైగా ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు.
చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి.
Also Read:సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..జాగ్రత్త!
- Advertisement -