బీజేపీలో చేరితే..నో కేస్!

30
- Advertisement -

ఈమద్య కాలంలో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రతిపక్ష నేతలు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొంతమంది జైలుపాలు కాగా మరికొంత మంది కేసుల నుంచి బయట పడే మార్గాలను వెతుక్కుంతున్నారు. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రమే మనీ లాండరింగ్ కేసులలో దొషులుగా ఎందుకు తేలుతున్నారనే ప్రశ్నకు అందరి నోటి నుంచి వచ్చే ఒకే సమాధానం బీజేపీ వ్యూహంలో భాగమని. అయితే నిజంగానే ప్రతిపక్ష నేతలపై బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా ? కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా నియంత వైఖరి అవలంభిస్తోందా ? అంటే అవుననే సమాధానేమే ఎక్కువగా వినిపిస్తోంది. మరి బీజేపీ ఎందుకిలా వ్యహరిస్తోందంటే ప్రతిపక్షమే లేకుండా చేసే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు చాలమంది నేతలు ఆరోపిస్తున్నారు. .

అయితే కేసులతో సతమతమౌతున్న వారు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరితే వారి కేసులు క్లీన్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే బీజేపీ బలం పెంచుకునేందుకు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి ఇప్పటివరకు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పొలిటీషియన్స్ లో దాదాపు 25 మంది కాషాయ కండువా కప్పుకున్నారు. వారు బీజేపీలో చేరిన తరువాత ఎలాంటి కేసులు లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి 10 మంది, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీల నుంచి చెరో నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టిడిపి నుంచి ఇద్దరు, సమాజ్ వాదీ, వైసీపీ నుంచి చెరోకరు.. ఇలా చాలా పార్టీల నుంచి బిజెపి గూటికి చేరారు.

ఇలా చాలామంది నేతలను బిజెపి స్కామ్ ల పేరుతో బుట్టలో వేసుకుంది. ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితా కూడా బీజేపీ బాధితుల జాబితాలో ఉన్నారు. తాను బీజేపీలో చేరితే కేసులు కొట్టేస్తామని ఆఫర్ వచ్చినట్లు స్వయంగా కేజ్రివాల్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానింఛారు కూడా. ఆ ఆఫర్ కు నిరాకరించడంతోనే కేజ్రివాల్ జైలు పాలు అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ పదేళ్ళలో జరిగిన పరిణామాలను చూస్తే బీజేపీ వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం

- Advertisement -