నో బ్రేక్ అంటున్న బాలయ్య

99
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీర సింహా రెడ్డి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటివలే బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కోసం కొన్ని డేట్స్ కేటాయించి ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇటు సినిమా షూటింగ్ అటు తన టాక్ షో తో కొన్ని నెలలు ఫుల్ బిజీ గా గడిపిన బాలయ్య అనిల్ రావిపూడి సినిమాను కాస్త గ్యాప్ తీసుకొని మొదలు పెడతారని అందరూ ఊహించారు. కానీ బాలయ్య నో బ్రేక్ అంటూ NBK108 సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయాడు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య చేయబోతున్న సినిమా డిసెంబర్ 8 నుండి షూటింగ్ మొదలు కానుంది. అదే రోజు పూజ కార్యక్రమాలతో సినిమాలు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. బాలయ్య పెట్టిన ముహుర్తానికే సినిమా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో జరగనున్న ఈ షెడ్యుల్ లో పది రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా తీస్తారు.

ఫాదర్ , డాటర్ సెంటిమెంట్ తో అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ తో యాక్షన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటించబోతుంది. బాలయ్య సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇంకా మేకర్స్ కాస్టింగ్ ను ఫైనల్ చేయాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

ఇవి కూడా చదవండి..

మెగాస్టార్ ‘బాస్ పార్టీ’ మాస్‌ కి పక్కా ఫీస్ట్‌ !

క్లైమాక్స్‌లో వీరమల్లు.?

హే చైతూ.. ఏమిటి ఈ షాకింగ్ చేంజ్ ?

- Advertisement -