బర్త్ డే సెలబ్రేషన్స్‌కి దూరంగా కేటీఆర్..

97
KTR
- Advertisement -

ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ బర్త్ డే. ఇక రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తుండగా భారీ వర్షాల కారణంగా బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు కేటీఆర్.

భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -