తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్

3
- Advertisement -

అభిమానులను కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌లో సినీ ప్రముఖులతో సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం…శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు అన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని…తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు.

డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని…టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని ..శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.

Also Read:‘లైలా’… స్టైలిష్ లుక్‌లో విశ్వక్ సేన్

- Advertisement -