సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్

5
- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. సీబీఐ కేసులో మద్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది.

కేజ్రీవాల్‌ వేసిన రెండు పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టవిరుద్ధం అనడానికి తగిన కారణాలు లేవని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వాస్తవానికి ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సీబీఐ కేసులో బెయిల్ దొరకక పోవడంతో తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 17 నెలలుగా జైలులో ఉన్న మనీష్‌ సిసోడియా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read:నిద్రలేమి సమస్య…అయితే!

- Advertisement -