Chandrababu:వాయిదాలే.. నో బెయిల్?

36
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత యాబై రోజులుగా జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ లో అరెస్టయిన ఆయన ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి. బెయిల్ పై ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక తాజాగా మరోసారి ఆయనకు నిరాశే ఎదురైంది. స్కిల్ స్కామ్ లో రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. వచ్చే నెల 1 వరకు రిమాండ్ పొడిగించడంతో బాబుకు బెయిల్ రావడానికి ఇంకా టైమ్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జైల్లో తన భద్రత పై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు సరైన భద్రత లేదని, ఆయనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఇలా రకరకలుగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. .

ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఏమైనా లోపాలు ఉంటే జడ్జికి లేఖ రాయాలని ఏసీబీ కోర్టు సూచించింది. ఇక ఇదిలా ఉంచితే ఫైబర్ గ్రేడ్ స్కామ్, అంగళ్ళు వంటి కేసులు కూడా చంద్రబాబును వెంటాడుతున్నాయి. అమరావతి రింగ్ రోడ్డు స్కామ్ లో బాబుకు ఇటీవల కొంత ఊరట లభించిన సంగతి తెలిసిందే. కానీ స్కిల్ స్కామ్ లో రిమాండ్ పొడిగించడంతో అసలు చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇలాగే వాయిదాల పర్వం కొనసాగితే టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు హోల్డ్ లో పడ్డాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు బయటకు వచ్చే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. మరి బాబు బయటకు వచ్చేదెప్పుడో పార్టీలో జోష్ నింపేదెప్పుడో చూడాలి.

Also Read:18 ఏళ్ల కుర్రాడితో త్రిష బరితెగింపు

- Advertisement -