తెలంగాణలో గత రెండు రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో మంట పుట్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, బిఆర్‌ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. కాగా అధికార బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ తో కలిసే అవసరత ఉందా అనే దానిపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బిఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. సిఎం కేసిఆర్ సుపరిపాలన పట్ల తెలంగాణ ప్రజలు విశ్వసనీయతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ కు తిరుగులేని విజయం దక్కడం ఖాయమనే సంగతి ప్రతిపక్ష పార్టీలకు కూడా బాగా తెలుసు..
అందుకే ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకే బిఆర్‌ఎస్ తో పొత్తు అనే అంశాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు తెరపైకి తీసుకొచ్చారని రాజకీయ వాదుల అభిప్రాయం. ఇక కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా స్పందించారు. బిఆర్‌ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా బిఆర్‌ఎస్ కు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలల్లో విశ్వసనీయత లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి అటు కాంగ్రెస్ గాని, ఇటు బీజేపీ గాని బిఆర్‌ఎస్ ను ఇరుకున పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయనే చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యం కనబరచడం ఖాయమని గులాబీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..