బన్నీ పౌరాణికం త్వరలో

18
- Advertisement -

ద‌ర్శ‌కుడిగా కొరటాల శివ ఇప్ప‌టివ‌ర‌కు అటెంప్ట్ చేయ‌ని జోన‌ర్‌లో అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉంటుంద‌ని గతంలోనే వార్తలు వచ్చాయి. నిర్మాత బన్నీ వాసు కూడా ఆ మధ్య ఇలాంటి కామెంట్స్ నే చేశాడు. అయితే, ఆ తర్వాత మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ, గీతా ఆర్ట్స్ నుంచి తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్‌లో అల్లు అర్జున్ మూవీని కొరటాల శివ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి కాగానే కొరటాల, బన్నీ సినిమా మీదకు వస్తాడట.

ఈ సినిమా గురించి ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే, ఇదొక మైథ‌లాజిక‌ల్ మూవీ అని కచ్చితంగా తెలుస్తోంది. పౌరాణిక క‌థాంశంతో రూపొందే ఈ సినిమాతో బన్నీ ఓ యువరాజు పాత్రలో నటిస్తాడట. బన్నీ, ఈ జోన‌ర్‌లో ఇంతవరకు సినిమా చేయ‌లేదు. మ‌రోవైపు కొరటాల శివ కూడా పౌరాణికాల జోలికి ఇప్ప‌టివ‌ర‌కు వెళ్ల‌లేదు. ఇద్ద‌రు ఒకేసారి ఈ జోన‌ర్‌లో సినిమా చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న నెక్స్ట్ సినిమాను కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌.

కాబట్టి, ఎన్టీఆర్ సినిమాతో కొరటాల శివకు పాన్ ఇండియా ఇమేజ్ రానుంది. సో.. ఆ ఇమేజ్ బన్నీకి కూడా ఉపయోగపడనుంది. మరి అల్లు అర్జున్ తో కొరటాల శివ ఏ రేంజ్ సినిమా చేస్తాడో ?, ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. పైగా కొరటాల శివకి ఆచార్య ఎఫెక్ట్ బాగా తగిలింది. అందుకే, ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల అదనంగా కష్టపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -