ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి…

146
trs
- Advertisement -

ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ,బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్నం లావణ్య.మీడియాతో మాట్లాడిన ఆమె అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు మ‌హిళ‌లను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు.

మ‌హిళ‌ల‌ను అవ‌మానించేలా మాట్లాడ‌టం బీజేపీ నాయ‌కుల‌కు అల‌వాటై పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎంపీ అర‌వింద్‌ వెంటనే కవితకు, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నం లావ‌ణ్య డిమాండ్ చేశారు. ఈ మీడియా స‌మావేశంలో మహిళా కౌన్సిలర్లు, మహిళా కో అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ క‌విత‌పై ఎంపీ అర‌వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యల‌పై జ‌గిత్యాల జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ దావ వ‌సంత సురేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌విత‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే అర‌వింద్‌కు మ‌హిళా లోకం స‌రైన బుద్ధి చెబుతుంద‌ని ఆమె అన్నారు.

- Advertisement -