- Advertisement -
శుక్రవారం జరిగిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనెల 12న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఉపఎన్నిక బరిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలో ఉన్నారు. బ్యాలెట్ పద్దతిలో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహణను చేపట్టారు.
- Advertisement -