మొక్కలు నాటిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి

142
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు కలెక్టర్ నారాయణరెడ్డి. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా అద్బుతమని కొనియాడారు.

ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలిపారు.ఒకరు మొక్క నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. గ్రామాల్లో,మున్సిపాలిటీ ల్లో ఈ కార్యక్రమం ద్వారా గ్రినరీ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో బాగస్వామ్యమై మొక్కలు నాటే అవకాశం కల్గినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కలెక్టర్ నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావ్,జనగామ కలెక్టర్ నిఖిల,మెదక్ కలెక్టర్ హరీష్ ముగ్గురికి కలెక్టర్ నారాయణరెడ్డి చాలెంజ్ విసిరారు.

- Advertisement -