టీఆర్ఎస్‌లోకి నిజామాబాద్ బీజేపీ నేతల క్యూ..

363
nizamabad bjp

టీఆర్ఎస్‌లో చేరేందుకు నిజామాబాద్ జిల్లా బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు’ క్యూ ‘ కట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే&PUC చైర్మన్ ఏ ,జీవన్ రెడ్డి సమక్షంలో మాక్లూర్ మండలానికి చెందిన పలువురు బిజెపి ఎంపీటీసీ లు మంగళ వారం నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు బీజేపీ కి సరైన నాయకత్వం లేదన్నారు. పసుపు బోర్డ్ పై దుష్ప్రచారం చేసిన స్థానిక ఎంపీ అరవింద్ వైఖరి కి నిరసనగా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు.

టీఆర్ఎస్‌లో చేరిన వారిలో అమ్రాద్ గ్రామ ఎంపిటిసి లక్ష్మి శ్రీనివాస్, గొట్టిముక్కల గ్రామ ఎంపీటీసీ సత్య గాంగు రమేష్, గుంజిలి గ్రామ ఎంపీటీసీ సుజాత నవీన్, ఇసపల్లి గ్రామ (ఆర్మూర్ మండలం) ఎంపీటీసీ లినిత మహేష్ ఉన్నారు.

bjp