కిలిమంజారోను అధిరోహించిన టాలీవుడ్ హీరోయిన్‌..

205
Nivetha Thomas
- Advertisement -

తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేస్తుంది హీరోయిన్‌ నివేదా థామస్‌. వెండితెరపై కనువిందు చేసే ఈ అందాల భామ ఇప్పుడు ఏకంగా అతిపెద్ద శిఖరంపై కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన నివేద థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2016లో నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన నటనతో టాలీవుడ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అదిపెద్ద పర్వతమైన కిలిమంజారో అధిరోహించింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

- Advertisement -