దేశంలో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్‌ కేసులు..

41

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. దేశంలో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,75,468కి చేరింది. ఇందులో 1,72,594 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,35,48,605 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,54,269 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 16,479 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 561 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.