ఎన్నో కష్టాలకు తట్టుకుని ఈ సినిమా చేశాం- హీరోయిన్ నివేద

71
Nivetha Pethuraj

కరోనా సమయంలో ఎన్నో కష్టాలకు తట్టుకుని ఈ సినిమా చేశామని.. మా మంచి ప్రయత్నాన్ని అందరు ఆదరించారని హీరోయిన్ నివేద పేతురేజ్ చెప్పుకొచ్చింది. హీరో విష్వ‌క్‌సేన్, నివేద పేతురేజ్, సిమ్రాన్ చౌద‌రి,మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పాగ‌ల్‌. ఈ సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌లై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, ఈ సందర్బంగా సోమవారం హైద్రాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేద పేతురేజ్ మాట్లాడుతూ ..చాలా ఆనందంగా ఉంది .. ఈ సినిమా విజయం. ఇది ఎమోషనల్ జర్నీ మాకు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మేము పెట్టిన ఎఫర్ట్‌కు మంచి ఫలితం వచ్చింది. ఏ సినిమా విషయంలో అయినా టీం సపోర్ట్ ఉంటె తప్పకుండా అది మరో రేంజ్ సినిమా అవుతుంది. ఆలా మా టీం ఇచ్చిన సపోర్ట్‌తో అందరం ఎఫర్ట్ పెట్టి సినిమా తీశామని తెలిపింది.

కరోనా సమయంలో ఎన్నో కష్టాలకు తట్టుకుని ఈ సినిమా చేసాం. తప్పకుండా మా మంచి ప్రయత్నాన్ని అందరు ఆదరించారు. మా హీరో విశ్వక్ సేన్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అతనికి సినిమా అంటే ఇష్టం. విశ్వక్ ఎఫర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. మరో సారి అతను ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అన్నారు నివేద.