టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ యూత్ ఆడియెన్స్‌లో క్రమంగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. ప్రధానంగా ఆయన యూత్‌ను ఎట్రాక్ట్ చేసే స్క్రిప్టులను ఎంచుకుంటున్నారు. ఆ వరుసలో వస్తున్న ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘పాగల్’. ఈ మూవీపై యూత్‌పై మంచి బజ్ నెలకొంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ సాంగ్‌కు ఎక్సలెంట్ రెస్పాన్స్ లభించింది. డైరెక్టర్ నరేష్ కుప్పిలి మ్యాజికల్ లవ్ స్టోరీగా ‘పాగల్’ను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సిమ్రన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మరో నాయికగా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా పేతురాజ్ పేరును ఎనౌన్స్ చేశారు. తీర అనే పాత్రను నివేదా పోషిస్తున్నట్లు గురువారం ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఆ పోస్టర్‌లో హీరో విష్వక్ సేన్ రెండు చేతులు వెనక్కి పెట్టి ఉన్నాడు. నివేదా పేతురాజ్ ఆయనను హత్తుకొని ఉంది. ఆసక్తికరమైన విషయమేమంటే విష్వక్ సేన్ చేతులు రెండూ కలిపి కట్టేసి ఉన్నాయి. విడుదల చేసిన కొద్ది సేపట్లోనే ఈ పోస్టర్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. మే 1న ‘పాగల్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది.ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, రధన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.
తారాగణం:విష్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి, మేఘలేఖ, రాహుల్ రామకృష్ణ.
సాంకేతిక బృందం:
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
మ్యూజిక్: రధన్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కె.కె., కిట్టు విస్సాప్రగడ
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, రామకృష్ణ
డాన్స్: విజయ్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైన్: లతా తరుణ్
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
పీఆర్వో: వంశీ-శేఖర్.