మరో అందమైన సినిమాతో కలుస్తా…

237
Niveda Thomas on Jr NTR's Jai Lava Kusa
- Advertisement -

‘జెంటిల్మెన్’, ‘నిన్నుకోరి’ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ నివేదా థామస్. తన అందంతోనే కాదు అభినంతోనూ ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ మలయాళ మనోహరి జై లవకుశతో హ్యాట్రిక్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో గ్లామర్‌ లుక్‌తో మరింతగా కట్టిపడేసిన ఈ భామ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ తెగవైరల్ అవుతోంది.

అభిమానులకు ధన్యవాదాలు తెలియచేస్తూ ట్విట్టర్ లో ఓ లెటర్ ను పోస్టు చేసింది. ఒక సినిమా హిట్ అవడం ప్రత్యేకమని, మొదటి మూడు సినిమాలను అభిమానులు బాగా ఆదరించారని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సొంత మనిషిలా చూసిందని..ఇంతకన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదన్నారు.

దీనిని తాను ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు..అభిమానులకు, కుటుంబసభ్యులకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువేనన్నారు. ‘జై లవ కుశ’ కు ఇంత పెద్ద విజయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, మరో అందమైన చిత్రం..మరో పాత్రతో కలుస్తానని ‘నివేదా థామస్’ లేఖలో పేర్కొంది.

- Advertisement -